Mahabub badPoliticalTelangana

ఎస్సై కావాలనుకుని.. ప్రేమకాటుకు యువతి బలి

ఎస్సై కావాలనుకుని.. ప్రేమకాటుకు యువతి బలి

ఎస్సై కావాలనుకుని.. ప్రేమకాటుకు యువతి బలి

Web desc : ఎస్సై కావాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్న యువతి ప్రేమకాటుకు బలి అయ్యింది. ప్రేమ విఫలం కావడంతో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, యవకుడి కుటుంబ సభ్యులే యువతిని ఉరివేసి చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునిగె కుమారస్వామి, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

దంపతులు వ్యవసాయం , కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, పెద్ద కుమార్తె సుస్మిత ( 25 ) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగ శిక్షణ తీసుకుంటుంది. అదే గ్రామానికి చెందిన అనిల్, సుస్మిత రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఆమె పెండ్లి చేసుకోవాలని అతడిని కోరగా వేరే కులం అమ్మాయి అయినందున తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని అనిల్​ వాయిదా వేస్తూ వచ్చాడని, ఒకసారి గర్భ స్రావం కూడా చేయించాడని, సుస్మితను అనిల్​, అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్సే ఉరివేసి చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎస్సైగా ఎదగాల్సిన తమ బిడ్డ ఇలా ప్రాణాలు కోల్పోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మహబూబాబాద్​ అండర్​ బ్రిడ్జి వద్ద ఆందోళనకు దిగారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button