BhadrachalamPoliticalTelangana

ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్…14 గ్రామాలు ఆగమాగం

ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్...14 గ్రామాలు ఆగమాగం

ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్…14 గ్రామాలు ఆగమాగం

భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలో 14 గ్రామాలు ఆగమాగం

భద్రాది జిల్లా : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది.

ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు. మూడు క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి 7.45 సమయంలో కట్ట పూర్తిగా తెగిపోయింది. పెద్దవాగుకు గండిపడటంతో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి కోయరంగాపురం, రమణక్కపేట, కొత్తూరు గ్రామాలకు పాక్షికంగానష్టం జరిగింది.

ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండి, కోయమాదారం, కొత్తపూచి రాల, పాతపూచిరా, అల్లూ రినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం వాటిల్లింది.

కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలుచే పట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో వారంతా వేలేరుపాడులో ఉండి పోయారు.

దాదాపు 2వేల కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు పూర్తిగా నిలిచిపోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవ డంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.

పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారు దలశాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. గండి పూడ్చేందుకు రూ. 20కోట్ల వరకు ఖర్చు అవుతుందని జలవనరుల శాఖ డీఈ తెలిపారు…

నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: జిల్లాలకు రెడ్ అలర్ట్

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 20వ తేదీన కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.

ఇవేకాకుండా మరో 6 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోల్డు, లోలెవల్ వంతెనలు మునిగి పోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button