PoliticalTelangana

తెలంగాణలో ACB దూకుడు..

తెలంగాణలో ACB దూకుడు..

తెలంగాణలో ACB దూకుడు..

ఆరునెలల్లో రూ.కోట్ల కొద్దీ అక్రమాస్తుల స్వాధీనం

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB) దూకుడు పెంచింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 126 అవినీతి కేసులను నమోదు చేసింది.

ఈ కేసుల్లో 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కాలంలో రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.

లంచాలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతూ 80 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వివిధ శాఖల నుంచి రూ.24.57 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే రూ.3.43 లక్షలు సీజ్ చేశారు. మరోవైపు

ఆర్‌టీఏ చెక్‌పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీల్లో రూ.2.72 లక్షల అక్రమ నగదు స్వాధీనం చేశారు.

8 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.13.50 లక్షలు స్వాధీనం చేసుకోగా, మరో రూ.5.22 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇవే కాకుండా అదనంగా, 14 క్రిమినల్ మిస్‌కండక్ట్ కేసులు, 10 రెగ్యులర్ ఎంక్వైరీలు, 11 ఆకస్మిక తనిఖీలు, 3 డిస్క్రీట్ ఎంక్వైరీలు నమోదయ్యాయి.

ఒక్క జూన్‌లోనే 31 కేసులు నమోదు కాగా అందులో 15 ట్రాప్ కేసులు, 2 ఆస్తుల కేసులు, 3 మిస్‌కండక్ట్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో 129 కేసులను ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపగా, జూన్‌లో 11 కేసులు ఫైనలైజ్ అయ్యాయి. ఈ మేరకు ఏసీబీ వివరాలు విడుదల చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button