KhammamPoliticalTelangana

ఖమ్మం పార్లమెంట్ సోషల్ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నవీన్ పెట్టం

ఖమ్మం పార్లమెంట్ సోషల్ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నవీన్ పెట్టం

ఖమ్మం పార్లమెంట్ సోషల్ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పెట్టం

ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సోషల్ మీడియా కో-యించార్జ్ బండి మాధవరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెట్టం నవీన్ గారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పెట్టం నవీన్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కొరకు చేపడుతున్న 6 గ్యారెంటీల గురించి మండల స్థాయి గ్రామస్థాయి మరియు బూత్ స్థాయి నుండి గడపగడపకు ప్రతి ఒక్కరికీ తెలిసేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని.

అందుకుగాను గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి ఒక్క మండలంలోనూ కోఆర్డినేటర్స్ ను నియమించాలని జిల్లా మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్స్ కు ఆదేశాలిస్తూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా సోషల్ మీడియా వేదికగా కృషిచేసిన ప్రతి ఒక్క కోఆర్డినేటర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కొరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ను నియమించి, కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా తనదైన శైలిలో కృషిచేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన పెట్టం నవీన్ అన్నగారికి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ జిల్లా మరియు నియోజకవర్గ మరియు మండల కోఆర్డినేటర్స్.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్,దేవా, శ్రీనివాసరావు, వీరభద్రం, కనకం పవన్ కళ్యాణ్, దివ్య, రాంబాబు, అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button