MedchalPoliticalTelangana

ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది : మేడ్చల్ ఏసిపి

ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది : మేడ్చల్ ఏసిపి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య మృతిపై మేడ్చల్ ఏసిపి రాములు కీలక ప్రకటన చేశారు. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో రూపా దేవి సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం అందిందని..వెంటనే ఘటన స్థలికి చేరుకున్నామని వెల్లడించారు.

గత కొంతకాలంగా రూపా దేవి తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్నారు….మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపునొప్పుతో బాధపడుతున్నారన్నారు. ఇప్పటికే వివిధ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు…హోమియో మందులు కూడా వాడుతున్నారు అయినప్పటికీ కడుపునొప్పి తగ్గలేదని వివరించారు.

దీంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు… తాను సూసైడ్ చేసుకోవడానికన్న ముందు భర్త మేడిపల్లి సత్యం కు రూపడేవీ ఫోన్ కాల్ చేసారన్నారు రాములు.

ఆ సమయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండిలో ఉన్నారు….తాను కడుపు నొప్పితో పడుతున్న బాధను భర్తకు వివరించారని వెల్లడించారు. నేను వస్తున్నాను అని సత్యం ఆయన సతీమణికి చెప్పారు….

బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్ కు రూపా దేవి ఉరివేసుకున్నారని వెల్లడించారు. వెంటనే సమీపంలోని రెనోవ హాస్పిటల్ కి తీసుకువచ్చారు..పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని చెప్పారన్నారు.

భార్యాభర్తల వద్ద ఎలాంటి విభేదాలు లేవు.. అంతా కలిసే ఉంటున్నారని తెలిపారు. రూపా దేవి సూసైడ్ చేసుకునే సమయంలో ఆమె తల్లితోపాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button