PoliticalTelangana

ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయాలి…

ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయాలి…

మదర్ డైరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 04

ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయాలి
మదర్ డైరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేయాలని మదర్ డైరీ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు.

ఆదివారం మండలంలోని కొలనుపాక లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…నేడు యాదగిరిగుట్టలో నిర్వహించే నియోజకవర్గ బి ఆర్ ఎస్ విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టా బద్రులు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు.పట్టా బద్రుల శాసనమండలి ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రతి ఒక్క పట్టా బద్రులు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నరసింహులు,మాజీ ఎంపిటిసి మామిడాల ఆంజనేయులు, బిఆర్ఎస్ యువజన విభాగం మండల ఉపాధ్యక్షులు మిట్టపల్లి వీరస్వామి, కోరిపల్లి సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button