Political
Trending

జారిపడ్డ బి ఆర్ యస్ ఎమ్మెల్యే

జారిపడ్డ బి ఆర్ యస్ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి తీవ్ర గాయాలు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట (Kaleshwaram Commission) విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao)తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.

అయితే, రాత్రంతా ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అక్కడే ఉండి తీవ్ర అస్వస్థతకు గురై బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోయారు. దీంతో ఆయన కాలు విరిగినట్లుగా సమాచారం. అనంతరం అప్రమత్తమైన ఫామ్‌హౌస్ సిబ్బంది పల్లా రాజేశ్వర్ రెడ్డిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హుటాహుటిన సోమాజిగూడ (Somajiguda)లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వైద్యులు ఆయనకు సర్జరీ చేయనున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button