KhammamPoliticalTelangana

పరామర్శలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన ప్రారంభం

పరామర్శలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన ప్రారంభం

పరామర్శలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన ప్రారంభం

సికె న్యూస్ ప్రతినిధి

నేలకొండపల్లి: కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నేలకొండపల్లి మండలం నుంచి శనివారం ఉభయ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలుత ముజ్జుగూడెం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రేగుల చిన్నపుల్లయ్య భార్యను పరామర్శించారు.

మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర మంత్రి పొంగులేటి శీనన్న దృష్టికి తీసుకెళ్తానని, ధైర్యంగా ఉండాలని అభయం ఇచ్చారు. ఇదే గ్రామంలో షేక్ కన్నాం సాబ్, జాన్ బీ లను, మరో ఇంట వికలాంగ చిన్నారిని పరామర్శించారు.

అనంతరం అనాసాగరం లో సళ్ళంగుండ సావిత్రమ్మ, గూనగుంట్ల వెంకయ్య, అనంత రామయ్య ల ఇళ్లకు వెళ్లి వారిని ఓదార్చారు. ఆ తర్వాత సదాశివపురం లో అనారోగ్యంతో బాధ పడుతున్న ఎండ్రాతి ప్రమీల, వీ ఆర్ ఏ నోచిన రోశయ్య లను పరామర్శించారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వజ్జా రమ్య, కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు , శాఖమూరి రమేష్, వెన్నపూసల సీతారాములు, గూడవల్లి రాంబ్రహ్మం, కుక్కల హనుమంతరావు , మహిషా శంకర్, మట్టా దుర్గారెడ్డి , ఎడవల్లి సైదులు, జర్రిపోతుల అంజని, బచ్చలిపుర నాగరాజు, మరికంటి వి రాణి , రమేష్, కొత్తకోళ్ల సుధాకర్, బోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button