EducationTelangana

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే

గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను జూన్ 1వ తేదీ నుండి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

అభ్యర్థులు టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం శాంపిల్ ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది.

జూన్ 9న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించున్నట్లు పేర్కొంది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ఇప్పటి వరకు రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష జరగగా..

పేపర్ లీక్, ఇతర కారణాల వల్ల రెండు సార్లు ఎగ్జామ్ రద్దు అయ్యింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. ఆ పోస్టులకు మరికొన్ని జాబ్‌లు యాడ్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 9 ప్రిలిమినరీ పరీక్ష జరగనుండగా.. అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించునున్నారు. 563 పోస్టుల కోసం దాదాపు 4.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button