KhammamTelangana

అదుపు తప్పిన డిసిఎం... డ్రైవర్ మృతి..

అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన డిసిఎం…

డ్రైవర్ మృతి..

అదుపుతప్పి డీసీఎం చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ చనిపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్లూరు వైపు నుండి తల్లాడ వస్తున్న డీసీఎం వ్యాన్ అంజనాపురం గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల వద్ద తల్లాడ, దేవరపల్లి జాతీయ రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన డ్రైవర్ ఒక్కల శ్రీనివాస్(38) క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కొండలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో దాదాపు గంటపాటు శ్రమించి క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీశారు.

తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ను ప్రైవేట్ అంబులెన్స్ వాహనంలో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించిన కొద్దిసేపటికి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తల్లాడ ఎస్సై తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button