HyderabadPoliticalTelangana

నాకు ప్రాణహాని ఉంది… బర్రెలక్క..

భద్రత కల్పించాలని పిటిషన్ వేసిన బర్రెలక్క.. నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు

హైదరాబాద్:నవంబర్ 24
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో చాలా మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలు చేయాలని భావిస్తున్నారు. అందులో నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతి ఎన్నికల బరిలో నిలిచారు.

నామినేషన్ వేసేందుకు సిద్దమైన రోజు మొదలు నేటి వరకూ ఆమెకు బెదిరింపులు, దాడులు ఎదరువుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు ఈ యువతి. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను ఓట్లు చీల్చుతాననే భయంతోనే కొందరు నాపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో,వారు ఏ పార్టీకి చెందిన వారో కూడా తనకు తెలుసన్నారు.

కానీ వాళ్ల వివరాలు ఇప్పుడు వెల్లడించనన్నారు. ప్రాణం పోయినా ఈ పోరాటంలో వెనుకడుగు వేసిదే లేదన్నారు.నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. భవిష్యత్తులో 1000 అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా అన్నారు. యవతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుందని తెలిపారు.

నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే యువకుడిని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. తనకు అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇలాంటివి ఎన్ని సంఘటనలు ఎదరురైనా నేను దేనికీ భయపడను’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తనపై జరిగిన దాడిని ఖండిస్తూ.. తనకు భద్రతను కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెకు మద్దతుగా అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల అండగా ఉంటామని ప్రకటించారు.

దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బర్రెలక్కకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరుతామన్నారు. గతంలో జరిగిన దాడి నేపథ్యంలో తనకు 2ప్లస్2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ,బర్రెలక్క అలియాస్ ,కర్నె శిరీష హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై నేడు విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందించి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఈమెకు భద్రత కల్పించాలని తీర్పు వెలువరిస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారే అవకాశం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button