PoliticalTelangana

ప్రమాదంలో మరణించిన యువకుల భౌతికకాయాలకు నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి

ప్రమాదంలో మరణించిన యువకుల భౌతికకాయాలకు నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి

సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ :

పిల్లల మరణం తల్లితండ్రులకు జీవితంలో తీరని దుఃఖం

దావాజి పల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులు

మరణించిన యువకుల భౌతికకాయాలకు నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్ గల్ మండలం దవాజి పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అన్నారం దవాజి పల్లి మధ్యలో డీసీఎం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు

శ్రీకాంత్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అలాగే మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రం లోనీ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ లో రోడ్ ప్రమాదంలో మరణించిన గడ్డం రాంబాబు(22),గడ్డం శివ(19) అనే ఇద్దరు యువకుల భౌతికకాయలను రాష్ట్ర ఎక్సైజ్ , పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్,వనపర్తి నియోజకవర్గ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button