HyderabadPoliticalTelangana

మణికొండ పుప్పాలగూడ లో భారీ అగ్ని ప్రమాదం?

మణికొండ పుప్పాలగూడ లో భారీ అగ్ని ప్రమాదం?

మణికొండ పుప్పాలగూడ లో భారీ అగ్ని ప్రమాదం?

హైదరాబాద్ మణికొండ పరిధిలోని పుప్పాలగూడ లో ఈరోజు తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెం ట్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటం తో అపార్ట్ మెంట్ వాసులు భయంతో పరుగులు పెట్టారు.

ఈరోజు ఉదయం 3.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటల కారణంగా అపార్ట్ మెంట్ లోని వంటగదిలో ఉన్న సిలీండర్ సైతం పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ప్లాట్ లోని ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకు న్నారు.

ఈ ఘటనలో ప్లాట్ పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అపార్ట్ మెంట్ లో మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక శకటాలతో వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేం దుకు ప్రయత్నించారు.

అయితే, అపార్ట్ మెంట్ వద్ద ఫైర్ ఇంజిన్ పోవడానికి దారి లేకపోవటంతో గంటసేపు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. నిబంధనలకు విరుద్దంగా అపార్టు మెంట్ నిర్మాణం ఉండటంతోనే ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది తమ ప్రయత్నాలు చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్ట్ మెంట్ లో దాచుకున్న డబ్బులు, దుస్తులు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి.

పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని దర్యాప్తు చేప్టటారు. ప్లాట్ లో షార్ట్ షర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button