MedchalPoliticalTelangana

స్కూటీని ఢీకొన్న టిప్పర్ - బాలుడి మృతి..

స్కూటీని ఢీకొన్న టిప్పర్ - బాలుడి మృతి..

స్కూటీని ఢీకొన్న టిప్పర్ – బాలుడి మృతి..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదిలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మల్లంపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు బాలుడి పైనుంచి టిప్పర్ వెళ్లడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

తల్లితో కలిసి స్కూల్‎కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ ఢీకొట్టి మీద నుంచి వెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ మీద నుంచి వెళ్లడంతో బాలుడి మృతదేహాం నుజ్జునుజ్జు అయ్యింది.

ఈ ప్రమాదంతో ఘటన స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కండ్ల ముందే కొడుకు చనిపోవడంతో తల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button