HyderabadPoliticalTelangana

చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు ఉండనుంది. మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పారు చల్లా వంశీచంద్ రెడ్డి.

కాగా,తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి ప్రజాభవన్ లో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్న చిన్నారెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కాక ముందే 4 పథకాలను అమలు చేశారని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు గత కేసీఆర్ ప్రభుత్వంపై చిన్నారెడ్డి నిప్పులు చెరిగారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button