KhammamPoliticalTelangana

నేల ఆఖరి కల్లా 4.5 ఇల్లు ప్రారంభిస్తాం

నేల ఆఖరి కల్లా 4.5 ఇల్లు ప్రారంభిస్తాం

ధరణి ని శాశ్వతంగా తుది ముట్టించాలి

రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో బీఆర్ఎస్ పేదోడి సొమ్మును దుర్వినియోగం చేసింది

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో సముచిత స్థానం కల్పించాలి

సీతారామ 1 లక్ష 75 వేల ఎకరాల ఆయకట్టును స్దికరించేందుకు 93. కోట్లు ఖర్చుపెట్టి 9.6 కిలోమీటర్లు ఏన్కూరు వద్ద లింక్ కెనాల్ ఏర్పాటు చేశాం

నెల ఆఖరి కల్లా 4.5 ఇల్లు ప్రారంభిస్తాం

సికె న్యూస్ ప్రతినిధి

సత్తుపల్లి: ఎన్నికల సమయంలోనే చెప్పాం కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాష్ట్రంలో ధరణితో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ధరణి శాశ్వతంగా తుది ముట్టించాలని రాష్ట్ర రెవిన్యూ అండ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

సీతారామ రీ డిజైన్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ గొప్పోలకు పోయి పేదోడి సొమ్మును దుర్వినియోగం చేసిందని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీలైనంత పొదుపు చేస్తూ సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 550. కోట్లు పాత పేమెంట్లు చేశామని నిద్రపోతున్న కాంట్రాక్టర్లను మేల్కొల్పి సీతారామ 1 లక్ష 75 వేల ఎకరాల ఆయకట్టును స్దికరించేందుకు 93 కోట్లు ఖర్చుపెట్టి 9.6 కిలోమీటర్లు ఏన్కూరు వద్ద లింకు కెనాల్ ను ఏర్పాటు చేశామని. ప్రజల సొమ్ము నిరుపయోగంగా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చాక యుద్ధ ప్రాతిపదికన కెనాల్ పూర్తి చేస్తున్నామని.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 7. లక్షల 19 వేల కోట్లు వుంది. ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6 వేల కోట్లు వడ్డీనే చెల్లిస్తుందని ఆయన తెలిపారు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందుల్లేకుండా చిత్తశుద్ధితో 31 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని.

నిబద్ధతతో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల నెరవేర్చేందుకు ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తుందని గ్రామీణ ప్రాంతాలలో తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇబ్బందులు ఉన్నాయని. రాబోయే కొద్ది రోజుల్లో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ రాజ్యమన్నారు ఆయన అన్నారు,

రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండేందుకు భరోసా కల్పించేందుకు చట్టాన్ని సవరించబోతున్నామని ప్రజల అభిప్రాయాలతో రెవిన్యూ చట్టాన్ని మార్చబోతున్నామని ఆయన తెలిపారు. గత బిఆర్ఎస్ పాలనలో ఇళ్ల స్థలాల రెగ్యులరేషన్ చేసేందుకు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాబోయే మూడు నెలల లోపు నాణ్యమైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అప్రూవల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.

గడిచిన ప్రభుత్వం యొక్క పాపాలే ఈనాటి రైతు ఆత్మహత్యలకు కారణాలని బీఆర్ఎస్ కాపట ప్రేమ కపట నాటకాలను రైతులు,నిరుద్యోగ యువతులు ప్రజలు గమనిస్తున్నారని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కారు కోతలకు కుస్తున్నారని.

మళ్లీ నోరు తెరిస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు, మెన్న కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం తెలంగాణ రాష్ట్ర పేరు ఉచ్చరించకపోవడం బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి రావలసిన నిధులు సముచిత స్థానం కల్పించాలి ఆయన కోరారు,

రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా 4.5 లక్షల ఇల్లు ఈ నెల ఆఖరి కల్లా ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన పంటల భీమా కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని రైతును రాజకీయాలనేదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు,

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, సీతారామ ప్రాజెక్టు అధికారులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు,…..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!