PoliticalTelangana

శబరిమలై అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే వెంకటరావు.

శబరిమలై అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే వెంకటరావు.

శబరిమలై అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మే 15,

దేశం సుభిక్షంగా ఉండడం కోసం అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తెల్లవారుజాము శబరిమలై అయ్యప్ప స్వామి వారిని ఆయనతోపాటు ఎమ్మెల్యే లు వెంకటరావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రావాలని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని వేడుకోవడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల సందర్భంగా తీరికలేని సమయంతో కొంత అలసట, ఒత్తిడి ఏర్పడ్డాయి అన్నారు…

శబరిమలై అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం తో ప్రశాంతత లభించిందని మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయ్యప్ప దర్శనం ఎంతో ఆనందం ఇచ్చిందని ఆయన అన్నారు.

ఈ పర్యటనలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆది నారాయణ, డిసిసి చైర్మన్ తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీఎంఎస్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఎండి నవాబ్ ఉన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button