PoliticalTelangana

చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మృతి…

చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మృతి…

నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ జోరుక ధరణి(24) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఎస్సై ప్రశాంత్‌ బాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన జోరుక రాజేశ్వరి, కుమారస్వామి దంపతుల కూతురు ధరణి నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉంటోంది.

తన ద్విచక్రవాహనం కోసం తీసుకొచ్చిన పెట్రోల్‌ను గదిలో ఉంచింది. ఈ నెల 13న పెట్రోల్‌ బాటిల్‌ లీకేజీ కావడంతో గదిలో మంటలు వ్యాపించి ధరణికి అంటుకోగా బయటకు వచ్చింది.

ఈ విషయం సహ మహిళా కానిస్టేబుల్‌ స్వర్ణకు చెప్పింది. అప్రమత్తమైన స్వర్ణ పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ కాలిన గాయాలతో ఉన్న ధరణిని పెట్రోకార్‌లో ఎంజీఎంకు తరలించింది.

వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ధరణి మృతితో స్వగ్రామం పెంబర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతురాలి సోదరుడు వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, 2020 బ్యాచ్‌కు చెందిన ధరణి.. పరకాల పోలీస్‌ స్టేషన్‌లో మొదటి పోస్టింగ్‌ పొందారు. అనంతరం 2022 సెప్టెంబర్‌లో బదిలీపై నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button