KhammamTelangana

గడ్డం చెండమ్మ ప్రధమ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం….

గడ్డం చెండమ్మ ప్రధమ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం….

సి కే న్యూస్ (సంపత్) జూన్ 12

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జైన్ మందిర్ ఆవరణలో బుధవారం రోజున మా చిన్ననాటి మిత్రులు గడ్డం సిద్ధులు ముదిరాజ్ తల్లి గడ్డం చెండమ్మ ప్రధమ వర్ధంతి సందర్భంగా నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మోత్కూరి అయిలయ్య మాట్లాడుతూ..మా చిన్ననాటి మిత్రులు వారి తల్లి జ్ఞాపకార్థం నిరుపేద కుటుంబాలకు ఒక పూట భోజనం పెట్టాలని ఆలోచన రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు భైరి.విశ్వనాథం గౌడ్ ,పరుష.బంగారయ్య, బండపల్లి మహేష్ గౌడ్,విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button