KhammamPoliticalTelangana

కొణిజర్ల రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

కొణిజర్ల రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

కొణిజర్ల రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

కంటైనర్ డ్రైవర్ చాకచక్యంతో పెను ముప్పు తప్పింది

సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ జూలై 31 2026: కొణిజర్ల ప్రధాన రహదారిపై శుక్రవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది.కారు, కంటైనర్ డీసీఎం వాహనం పక్కపక్కనే ప్రయాణిస్తున్న సమయంలో మరో కారు అకస్మాత్తుగా కంటైనర్ ఎడమ వైపునకు కటింగ్ ఇవ్వడంతో ప్రమాద పరిస్థితి నెలకొంది.
అనూహ్యంగా ఎదురైన పరిస్థితిని గమనించిన కంటైనర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, వాహనాన్ని రోడ్డుపై నుంచి పక్కకు మళ్లించాడు. దీంతో కంటైనర్ రహదారి పక్కనే ఉన్న గుంతలోకి దిగిపోయినా, భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
ఈ ఘటనను చూసిన స్థానికులు, ప్రయాణికులు కంటైనర్ డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తిని అభినందించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని వారు పేర్కొన్నారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button