
విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి?.. కేసు నమోదు
సీకే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 01 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి భుక్య తమన్ తేజ్‌పై తెలుగు ఉపాధ్యాయుడు రాజేందర్ రెడ్డి దాడి చేశాడనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలైనట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై బాధ్య ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు, ఘటనపై పాఠశాల యాజమాన్యం కూడా అంతర్గత విచారణ చేపట్టింది. విద్యార్థి, ఉపాధ్యాయుడు, సంబంధిత సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విచారణలో వాస్తవాలు తేలిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవగా, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




