PoliticalTelanganaYadadri

విద్యార్థుల మృతిపై విచారణ జరిపించాలి...

విద్యార్థుల మృతిపై విచారణ జరిపించాలి...

విద్యార్థుల మృతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి వినతిపత్రం..

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 19

భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకుల హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని ఎస్సీ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ కలిసి వినతిపత్రం ఇచ్చినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, ఏడాది క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు..జరిగిన ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని,విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా,కుటుంబానికి ఒక ఉద్యోగం,డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో ట్రస్సా టి ఎస్ ఎస్ ఏ అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, ఎం ఆర్ పి ఎస్ నాయకులు చిట్టిపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button