
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి
పటాన్చెరు(రామచంద్రపురం), జూలై (సీకే న్యూస్ ప్రతినిది):
పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బావర్చి హోటల్ వద్ద గుర్తు తెలియని వాహనం డీకొని మహిళ మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం, సుమారు 45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ రోడ్డు ప్రమాదానికి గురికాగా, అత్యవసర సేవలైన 108 అంబులెన్స్ ద్వారా తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు వెంటనే అత్యవసర చికిత్స అందిస్తూ ఇంట్యూబేషన్, సీపీఆర్ నిర్వహించి, పలుమార్లు ఇంజెక్షన్లు ఇచ్చినా ఫలితం లేకపోయింది. అనంతరం ఉదయం 7:30 గంటలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతురాలి కుడి మోచేయి,ఎడమ పాదంపై గాయాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎంఎల్సీ కేసు నమోదు చేశారు.మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రామచంద్రాపురం ఎస్సై యాదగిరిని సంప్రదించాలని పోలీసు తెలిపారు.




