Khammam
Trending

యూరియా కొరతను నివారించండి

యూరియా కొరతను నివారించండి

యూరియా కొరతను నివారించండి

పూర్తి స్థాయిలో సాగునీటిని విడుదల చేయండి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్

సి కె న్యూస్ ప్రతినిధి

వర్షాలు పడడంతో మెట్ట పంటలతో పాటు ఇతర పంటలకు కూడా యూరియా అవసరం ఏర్పడిందని యూరియా కొరత రాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం -సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన గిరిప్రసాద్ భవన్లో జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ గత 15 రోజులుగా జిల్లాలో సరైన వర్షాలు లేకపోవడంతో రసాయనిక ఎరువుల వాడకం లేదని గడిచిన మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు రసాయనిక ఎరువులను వాడుతున్నారని పత్తి, మొక్కజొన్న, ఇతర మెట్ట పంటలతో పాటు వర్షాల రాకతో వరి నాట్లు కూడా మొదలు కావడంతో యూరియా అవసరం పెరిగిందన్నారు.

ప్రతి మండలంలోనూ ఎక్కువ సంఖ్యలో యూరియా విక్రయించే దుకాణాలను ఏర్పాటు చేయాలని పిఏ సిఎస్ ద్వారా యూరియాను విక్రయించేవిధంగా చర్యలు తీసుకోవాలని గోవిందరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగు చేస్తున్నారని, సాగర్ కాలువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు.

వ్యవసాయ అధికారులు రైతుల అవసరాలను గుర్తెరిగి తగు సూచనలు -ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, బానోత్ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button