HyderabadPoliticalTelangana

ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!

ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!

ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!

హైదరాబాద్‌ నగరంలోని మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌ ఏసీబీ వలలో చిక్కారు. అయితే సీఐ కొండల్‌ రావు రూ.6 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ హోంగార్డ్‌ ఏసీబీకి చిక్కారు.

సీఐ కొండల్‌ రావు ఆదేశాలతోనే లంచం తీసుకున్నట్లు సదరు హోంగార్డ్‌ అబిద్‌ అలీ ఏసీబీ అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ కేసు మూసివేతకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో సీఐ కొండల్‌రావు, హోంగార్డ్‌ అబిద్‌ అలీని అరెస్ట్‌ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు.

అయితే పోలీసులు, ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం.. పాతబస్తీ ఏరియాలో ఓ స్థలానికి సంబంధించిన సివిల్ వివాదంలో ఇన్‌స్పెక్టర్ కొండల్‌రావు జోక్యం చేసుకున్నారని, ఈ వ్యవహారాన్ని అనుకూలంగా పరిష్కరించేందుకు బాధితుడి నుంచి ముందుగా రూ. 10 లక్షల వరకు డిమాండ్ చేశారని తెలుస్తోంది. అయితే బాధితుడు అంత మొత్తంలో డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో చివరికి రూ. 6 లక్షలకు బేరం కుదుర్చుకున్నాని తెలుస్తోంది.

ఈ మొత్తంలో భాగంగా ముందుగా రూ.3 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. చివరికి సీఐ వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అనంతరం పాతబస్తీలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి. కేసు నమోదు చేసిన అధికారులు, నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button