KhammamPoliticalTelangana

కారులో కోటిన్నర... తప్పించుకునెందుకు యత్నం..

కారులో కోటిన్నర... తప్పించుకునెందుకు యత్నం..

కారులో కోటిన్నర… తప్పించుకునెందుకు యత్నం..

సినిమా తరహాలో పోలీసులు ఛేజ్..

ఖమ్మం జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. నాయకనగూడెం టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ కారును తనిఖీ చేయాలనుకునే లోపు నిలుపకుండా వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

పోలీసులు పది కిలోమీటర్లు చేజింగ్ చేస్తున్న క్రమంలో కారు పల్టీకొట్టింది. అందులు రూ.కోటిన్నర నగదు బయటపడింది.ఖమ్మం పోలీసుల వివరాల ప్రకారం.. రాష్ట్ర రాజధాని నుంచి ఖమ్మం వైపునకు ఓ ఇన్నోవా వెళ్తోంది.

నాయకనగూడెం వద్ద పోలీసులు తనిఖీ లు చేస్తుండగా ఇన్నోవా కారు ఆపితే ఆగకుండా వెళ్లింది. సిబ్బందికి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేశారు. పది కిలోమీటర్ల మేర పోలీసులు వాహనాన్ని తరిమారు.

ఈ క్రమంలో దేవుడి తండా వద్ద ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేసిన ఒకరికి గాయాలు కాగా ఆ వాహనంలో కోటిన్నర రూపాయలు పైగా నగదు బయట పడింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button