Telangana

రారండోయ్ వేడుక చూద్దాం..!

రారండోయ్ వేడుక చూద్దాం..!

రారండోయ్ వేడుక చూద్దాం..!

పొంగులేటి ఇంట మరో వివాహ వేడుక

ఈనెల 18న ప్రసాద్ రెడ్డి తనయుని రిసెప్షన్ మహెూత్సవం

– కల్లూరు నారాయణపురంలో భారీ సెట్టింగ్ తో ఏర్పాట్లు ముమ్మరం

ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట మరో వివాహ వేడుకకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహాం ఈనెల 14న దుబాయ్ లో జరగనుంది. వివాహానంతరం రిసెప్షన్ వేడుకను ఈనెల 18న కల్లూరు నారాయణపురంలో నిర్వహించేందుకు భారీ సెట్టింగ్ తో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ఎస్ఆర్ హెూమ్స్ అధినేత శ్రీనివాస రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పొంగులేటి అభిమానులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజానీకం తరలొచ్చే అవకాశం ఉన్నందుకు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి, తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button