ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో మాకు లేదా ప్రాధాన్యత….?
పార్టీ గెలుపుకై కష్టపడ్డ కార్యకర్తల మనోవేదన
మంత్రి ఇలా కాలో 2 వర్గాలుగా మారి మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
పోటాపోటీగా అధికారులకు మెమొరండాలు
జరుగుతున్న విషయాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి సమాచారం ఇచ్చిన
ఓ నాయకులు
ఎన్ని వర్గాలున్న ఎన్నికలు వస్తే ఉత్తమ్ సైనికులమే అంటున్న జండా మోసిన కార్యకర్తలు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 18
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మూకుమ్ముడిగా వారి గ్రామం నుండి వివిధ వాహనాల్లో మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయ అధికారులకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలలో తమ వర్గము వారినే కమిటీలో సభ్యులుగా నియమించాలని శుక్రవారం మెమొరాండాన్ని అందజేశారు. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కమిటీలలో నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడం లేదని వారి ఆవేదన గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో మాకు ప్రాధాన్యత కల్పించాలని మేము పార్టీ గెలుపుకై కష్ట కాలంలో జెండాలు మోసి ఎన్నో ఇబ్బందులకు గురైనామని ఇప్పుడు అధికారం వచ్చాక మమ్ములను లెక్కచేయకుండా ఒంటెద్దు పోకడలతో ఇష్టమొచ్చినట్టు కొందరు నాయకులు చేస్తున్నారని ఆవేదన చెందుతూ పోటాపోటీగా మండల కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శుక్రవారం అధికారులకు మెమోరండాలు సమర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇటీవల ఇందిరమ్మ కమిటీలో, ఒక వర్గం వారు, గ్రామ శాఖ అధ్యక్షుడికి సమాచారం లేకుండా, సీనియర్స్ కి ప్రాధాన్యం లేకుండా, వాళ్లకి నచ్చిన వారిని, ఎన్నుకొని, పేర్లను మండల కార్యాలయానికి పంపించడం జరిగిందని రఘునాధపాలెం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల పరిషత్ సూపరింటెండెంట్ అధికారికి అంతకు ముందు ఇచ్చిన పేర్లను రద్దు చేసి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎన్నుకోబడిన పేర్లను ఇందిరమ్మ కమిటీలో నియమించాలని కోరుతూ సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో జరుగుతున్న విషయాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఓ నాయకులు సమాచారం కూడా ఇచ్చారని అతి త్వరలో అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుందని సమాచారం మేధావి వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామంలో ఎన్ని వర్గాలు ఉన్నా ఎన్నికలు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికులుగా నిలబడతామని పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ మాకు సముచిత స్థానం కల్పించాలని ఉద్దేశమే తప్ప ఇది పార్టీ వ్యతిరేక కార్యక్రమం కాదు అని పార్టీ గెలుపుకై రానున్న స్థానిక ఎన్నికల్లో కృషి చేస్తామని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొబ్బ రవీందర్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ సన్నగండ్ల పకీర అహ్మద్ పందిరి పుల్లారెడ్డి మహమ్మద్ జమీల్ నాయుడు లక్ష్మయ్య మాగం నరసింహారావు రెడబోతుల శ్రీనివాస్ రెడ్డి కిషన్ నాయక్ పెద్దారపు పున్నయ్య వెంకటనారాయణ బొబ్బ సీతారామరెడ్డి దేవపంగు అచ్చయ్య మన్సూర్ అలీ యాదగిరి సైదారావు నాయుడు సైదయ్య చలికంటి వెంకటేష్ సయ్యద్ నాగుల్ మీరా పిల్లుట్ల భద్రయ్య తోట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.