KhammamTelanganaUncategorized

ఇల్లందులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఘరానా మోసం…

ఇల్లందులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఘరానా మోసం...

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..ఇదొక ఆన్లైన్ మోసం?

వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరుతో ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు.

ఖమ్మం జిల్లా…ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ అనే యువతి ఇటీవల బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది.

ఈ క్రమంలోనే నవ్యశ్రీకి ఈ నెల 2వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ జాబ్‌ పేరుతో ఓ లింక్‌ను పంపించాడు.

లింక్‌ను ఓపెన్‌ చేసి కొన్ని టాస్క్‌లు చేస్తే జీతం వస్తుందని నమ్మించారు. దీంతో నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్‌ ఓపెన్‌ చేసి వాల్లు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేసింది. అయితే ఇందుకోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, చెల్లించన దానికి ఎక్కువ మొత్తం తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు.

దీంతో వెనకా ముందు ఆలోచించని నవ్యశ్రీ.. తన అకౌంట్‌ను ఏడు దఫాలుగా మొత్తం రూ.91,100 పంపించింది. ఎంతకీ తిరిగి డబ్బులు చెల్లించకపోడంతో అనుమానం వచ్చి, తాను పంపిన డబ్బులు తిరిగి పంపాలని కోరింది.

దీంతో అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే సొమ్ము తిరిగి ఖాతాలోకి వస్తాయని సమాధానం ఇచ్చాడు. దీంతో తాను మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్‌ క్రైం 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం గురువారం స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button