HealthHyderabadPoliticalTelangana

మాజీ సీఎం కేసీఆర్ కు అస్వస్థత .. ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

మాజీ సీఎం కేసీఆర్ కు అస్వస్థత .. ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

మాజీ సీఎం కేసీఆర్ కు అస్వస్థత .. ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.
అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుప్రతికి వచ్చారు.

వివరాల ప్రకారం.. కేసీఆర్‌ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం అక్కడికి చేరుకున్నారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆయన.. గంట పాటు అక్కడే ఉన్నారు.

ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక, కేసీఆర్‌.. గత కొన్ని రోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో ఐదు రోజుల పాటు బంజారా హిల్స్‌లోని నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌లోని బాత్ రూంలో కాలు జారీ పడటంతో గాయమైన విషయం తెలిసిందే. అనంతరం, యశోద ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫాం హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button