KhammamPoliticalTelangana

ఎంపీ రఘురాం రెడ్డి ఔదార్యంతో ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు

ఎంపీ రఘురాం రెడ్డి ఔదార్యంతో ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు

ఎంపీ రఘురాం రెడ్డి ఔదార్యంతో ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు

  • క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణ కుమారి, కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్
  • పాల్గొన్న ఐఎన్ టీయూసీ బాధ్యులు
  • వివిధ అడ్డాల నుంచి అధిక సంఖ్యలో హాజరైన ఆటో డ్రైవర్లు

ఖమ్మం: పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ఔదార్యం చూపి ఆటో డ్రైవర్ల కోసం ఖాకీ చొక్కాలను సిద్ధం చేయించారు.

నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంపు కార్యాలయంలో మంగళవారం పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ వివిధ అడ్డాల నుంచి తరలివచ్చిన ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా.. మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్లకు.. యూనిఫామ్ చొక్కాలను ఎంపీ సమకూర్చడం..

ఎంతో సంతోషకరమని అన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కార్మికులందరికీ ఎంపీ క్యాంపు కార్యాలయం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో..: ఐ ఎన్ టీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్. విప్లవ్ కుమార్, కార్పొరేటర్ దొడ్డా నగేష్, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, నాయకులు పరికిపల్లి శ్రీను, ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, సంఘం బాధ్యులు సిద్ధల నగేష్, తోట సైదులు, కే. మధు, ఏ.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button