
ఏన్కూర్ జిపి లో ఏఎల్ఎంఎస్ సి కమిటీ ఏర్పాటు
– అంగన్వాడి కేంద్రాల సేవలపై సమీక్ష
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 24 2026: ఏన్కూర్ గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడి స్థాయి మానిటరింగ్ మరియు సహాయ కమిటీ (ఏఎల్ఎంఎస్ సి)కి చెందిన 11 మంది కొత్త సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ సమావేశానికి ఎంపీడీవో భాగ్యశ్రీ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు అంగన్వాడి కేంద్రాల్లో జరుగుతున్న పలు కార్యక్రమాలపై తల్లుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ముఖ్యంగా అంగన్వాడి భవన నిర్మాణం, ఎస్ ఏ ఎం మరియు ఎంఏఎం పిల్లల పరిస్థితి, అంగన్వాడి కేంద్రాల్లో ప్రతిరోజూ నిర్వహిస్తున్న ప్రీ-స్కూల్ కార్యక్రమాలను తల్లులు ఎలా వినియోగించుకుంటున్నారనే అంశాలపై చర్చించారు. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు మరియు బాలింతలకు అందించే పోషకాహారాన్ని కేంద్రంలోనే తీసుకోవాలని సూచించారు.
అలాగే హక్కుదారులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఏన్కూర్ 4 మరియు 6 అంగన్వాడి కేంద్రాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు.
అలాగే ఏన్కూర్ 2, 3, 5 గ్రామపంచాయతీ పరిధిలోని మొత్తం ఐదు అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తల్లులను నేరుగా సంప్రదించి కేంద్రాల వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బక్కమ్మ, అంగన్వాడి టీచర్లు సుశీల,అరుణకుమారి పాల్గొన్నారు.




