HyderabadPoliticalTelangana

నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

అసెంబ్లీ ఆవరణలో నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమా పణలు చెప్పాలన్నారు.

సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూ డదన్నారు. అయితే సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు.

శాసనసభ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు.

విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకొని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకొని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, శోభన్‌ రెడ్డి, తాతా మధు, మహమూద్‌ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button