EducationPoliticalTelangana

బీసీ హాస్టల్‌లో ఏసీబీ టీం ఆకస్మిక తనిఖీలు

బీసీ హాస్టల్‌లో ఏసీబీ టీం ఆకస్మిక తనిఖీలు

బీసీ హాస్టల్‌లో ఏసీబీ టీం ఆకస్మిక తనిఖీలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్‌లో ఉన్న బీసీ హాస్టల్ (బాలుర)లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను క్షుణంగా పరిశీలన చేపట్టారు. ప్రధానంగా 2024-25, 2025-26 సంబందించిన అన్ని విషయాలను కూలకుంకుశంగా అధికారులు తనిఖీలు చేస్తూ పరిశీలన చేస్తున్నారు.

గత మూడేళ్లలో పేద విద్యార్థులకూ నాణ్యమైన భోజనం, వసతులు కల్పించారా.. లేదా..? హాస్టల్ లో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా మెనూ అమలు చేశారా..? లేదా పరిసరాల పరిశుభ్రత పాటించారారికార్డుల పక్రియ న్యాయ బద్ధముగా ఉందా.. లేదా..? అనే విషయాలు దాదాపు ఆరు శాఖలకు చేందిన అధికారులు అన్ని కొణాల్లో పరిశీలన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు, విచారణ పూర్తయినా అనంతరం వివరాలు తెలియపరుస్తామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button