
ప్రచారంలో దూసుకుపోతున్న కొండపల్లి సరిత గణేష్ ..
వార్డు ప్రజల నుంచి ప్రచారానికి భారీ స్పందన…
కాంగ్రెస్ గెలిచే స్థానాలలో ఈ స్థానానిదే అగ్రస్థానం
సికె న్యూస్ ప్రతినిధి
ఇల్లందు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా 23వ వార్డులో.. వార్డు కాని వార్డులోకి వచ్చారు .. ఏం చేస్తారు లే.. అనుకున్నారు..
కానీ చాప కింద నీరులా మొదలయ్యాడు.. ఇప్పుడు ఏకంగా పొంగుతున్న యేరులా మారారు .. పట్టణంలోని 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని కొండపల్లి సరిత దూకుడు ఇది.
ఒక్క క్షణం కూడా విరామం లేకుండా ఇంటింటికి వెళుతూ, ప్రతి ఓటరును ప్రేమగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న కొండపల్లి గణేష్ సతీమణి సరితను గెలిపించాలని కోరారు. విసుగు, విరామం లేకుండా తిరుగుతున్న అతన్ని చూసి ఓటర్లు ఆశ్చర్య పోతున్నారు. క్రమక్రమంగా అతనిపై అభిమానం పెంచుకొని అతని వైపు తిరుగుతున్నారు.
అభ్యర్థులకు అర్థం కాని రీతిలో ఓటర్లను తన వైపుకు తిప్పుకుంటూ కొండపల్లి సరిత సాగుతున్న తీరు ఆకట్టుకుంటుంది. సోమవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా నేతలు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటికి తిరిగిన హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ప్రచారం చివరి రోజు తీసిన ర్యాలీ వార్డు ప్రజలను బాగా ఆకట్టుకుంది.. వార్డు ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని కాంగ్రెస్ అభ్యర్థిని కొండపల్లి సరిత గణేష్ అన్నారు. గతంలో తన వార్డును అభివృద్ధి చేసినట్లే 23వ వార్డులు కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
వార్డులో రహదారుల సమస్యలు, కాలువల సమస్యలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు..




