
మాట్లాడుతుండగా మైక్ కట్.. మైక్ విసిరేసి.. పోడియం పడేసి.. స్టేజ్పై ఎమ్మెల్యే రచ్చ రచ్చ..
Social media viral: మాట్లాడుతుండగా మైక్ కట్ అయ్యిందని ఒక ఎమ్మెల్యే రచరచ్చ చేశారు. మైక్ విసిరేసి, పోడియం తోసేసి.. తన అనుచరులతో చేసిన వీరంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడుతుంటే మధ్యలో మైక్ కట్ చేస్తరా అంటూ సౌండ్ ఆపరేటర్లపైకి మైక్ విసిరేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో నిర్వహించిన జౌల్జీబీ జాతరలో ఈ ఘటన జరిగింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రసంగం తర్వాత.. మాట్లాడేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామీ సభ నిర్వహణపై సీరియస్ అయ్యారు.
స్టేజ్ నుంచి సీఎం వెళ్లిపోయాక తన ప్రసంగం మొదలుపెట్టిన హరీష్ ధామీ.. ఉన్నట్లుండి మైక్ కట్ అవ్వడంతో షాకయ్యారు.తాను మాట్లాడుతుండగానే మైక్ అవ్వడంపై కోపంతో ఊగిపోయారు. సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లపై మైక్ విసిరారు. ఛైర్లు ఎత్తిప డేశారు. ఆపై స్టేజ్ మీద ఎక్కి పోడియంను కింద పడేసి సీఎంపై విమర్శలు గుప్పించారు.
తాము మాట్లాడక ముందే వెళ్లిపోవడం సీఎం కు పద్ధతి కాదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రజలకు వివరిస్తామనే భయంతో సీఎం ముందుగానే వెళ్లిపోయారని ఫైరయ్యారు. అదీకాక తాము మాట్లాడుతుంటే మైక్ కట్ చేయించారని విమర్శించారు.
విపక్షాల వ్యాఖ్యలను, విమర్శలను స్వీకరించే దమ్ములేని ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విపక్ష ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే సమయం ఇవ్వాలని కొందరు మద్ధతిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.




