PoliticalSiddipetaTelangana

విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు...

విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు...

విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు…

Web desc : విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థల్లో వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌కు సంబంధించిన వివాదం మరువకముందే, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని వెటర్నరీ విద్యాసంస్థలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు.

ప్రిన్సిపాల్‌ కొన్ని రోజులుగా వసతి గృహానికి రాత్రి వేళల్లో వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం, తన గదికి రావాలని ఒత్తిడి చేయడం, అనుచితంగా శరీర భాగాలను తాకడం, సెల్‌ ఫోన్‌ ద్వారా అశ్లీల సందేశాలు పంపుతున్నట్టు విద్యార్థినులు ఫిర్యాదులో పేరొన్నారు. దీనిపై యూనివర్సిటీ అధికారులు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేశారు.

ఈ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవాలు లేవు.. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల క్రమశిక్షణ, సిబ్బందిలో సమయపాలన కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలి. కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకావాలని, ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనానికి తగిన విధంగా విధులు నిర్వర్తించాలని సూచించాను.

విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు కక్ష పెంచుకుని, విద్యార్థులను ముందుపెట్టి ఫోన్లు చేయిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తూ, తన కుటుంబం, పిల్లల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే విధంగా మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

తనపై వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను లోతుగా పరిశీలించి సమగ్ర విచారణ ద్వారా నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి, అసత్య ప్రచారానికి తెరదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. – వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button