
వివాహేతర సంబంధం.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వివాహితులు ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య. తొలుత ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె అంత్యక్రియలు జరిగే లోపే బలవన్మరణానికి పాల్పడ్డ ప్రియుడు మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేష్ (31)కు భార్య, ఇద్దరు పిల్లలు. అయితే, అదే గ్రామానికి చెందిన మరో వివాహితతో అతనికి కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్న నరేష్.. సదరు వివాహితకు సైతం భర్త, ఇద్దరు పిల్లలు వీరి వ్యవహారం బయటపడడంతో గతంలో పంచాయితీ పెట్టి మందలించిన పెద్ మనుషులు అయితే, కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో జూన్ 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సదరు వివాహిత మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను గమనించి ఆసుపత్రికి తరలించగా.. నాటి నుంచి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన వివాహిత ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు నరేష్.. తన ప్రియురాలి దహన సంస్కారాలు జరుగుతున్న సమయంలోనే లింగ్సాన్ పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య
స్థానికుల, పోలీసుల కథనం మేరకు.. సుల్తాన్ పూర్ కు చెందిన మూడావత్ సునీత(28), భర్త శ్రీనివాస్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యవసాయానికి వాడే గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. భర్త శ్రీనివాస్ ఇంటికి వచ్చే వరకు ఆమె వద్ద పురుగుల మందు వాసన వస్తున్న విషయాన్ని గమనించి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. శనివారం రాత్రి గాంధీలో చికిత్స పొందుతూ సునీత మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన దరావత్ నాగరాజు(30) తో సునీత కు సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలిసింది.
గతంలో ఇద్దరు కలిసి నాందేడ్ కు వెళ్ళారు. పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేయడంతో ఇద్దరిని తీసుకు వచ్చి పెద్దల సమక్షంలో నచ్చజెప్పి పంపారు. కానీ ఇద్దరిదీ ఒకే గ్రామం కావడం మూలంగా సునీత, నరేష్ ల మధ్య బంధం కొనసాగినట్లు తెలిసింది.
ఇందులో భాగంగానే ఈ నెల 3న సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సునీతా మృతికి కారణం తానే అవుతానన్న భయంతో తిమ్మయి పల్లి అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తీసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ఇద్దరికీ గతంలో వివాహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.




