TelanganaVemulapalli
Trending

పచ్చారుగడ్డ ఆదర్శ కాలువ కట్ట ఆక్రమణ

పచ్చారుగడ్డ ఆదర్శ కాలువ కట్ట ఆక్రమణ

పచ్చారుగడ్డ ఆదర్శ కాలువ కట్ట ఆక్రమణ

కట్టపై మట్టి పోసి పంట పొలం కోసం ఆక్రమణ

అధికార పార్టీ నాయకుని ఆక్రమణదారునికి అండదండలు

పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు,కట్ట ఆక్రమణను ఆపాలంటున్న స్థానికులు

సీకే న్యూస్(మిర్యాలగూడ)
వేములపల్లి జూన్ 12

భూ బకాసురులు ఎన్ఎస్పి కాల్వకట్టను సైతం ఆక్రమణ చేసుకోవడానికి వెనకాడడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుండి లిఫ్ట్ ల ద్వారా మిర్యాలగూడ మండలం
పచ్చరుగడ్డ,వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారు ప్రాంత రైతుల పొలాల పారుగంతకు నీరు పారడానికి తీసినటువంటి ఆదర్శ కాల్వ కట్టను సైతం ఒక అధికార పార్టీ నాయకుని అండదండతో స్థానిక రైతు కూతవేటు దూరంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో ప్రభుత్వ అనుమతులు లేకుండ మనిషిలోతు గుంట త్రవ్వి అక్కడి నుండి త్రోలిన మట్టిని కట్టపై పోసి పక్కనే ఉన్నటువంటి తన పంట పొలంలో కలుపుకోవడం జరిగింది ఇంత.ఇది మొత్తం ఎక్కడో మారుమూల పంట పొలాలలో జరిగిన తంతుకాదు స్వయానా మిర్యాలగూడ-సూర్యాపేట రహదారికి ఆనుకుని నడుస్తున్న తంతు ఇంత జరుగుతున్నా కానీ ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్టు ఉండడం గమనార్హం.
ఆక్రమణకు గురవుతున్న ఆదర్శ కాల్వ కట్టను అధికారులు కాపాడాలి :-పచ్చారు గడ్డ గ్రామ ప్రజలు

వచ్చారు గడ్డ ప్రాంతంలోని స్థానికులు కొంతమంది ఆదర్శ కాలువ కట్టను ఆక్రమణకు గురి చేస్తున్నడంతో భవిష్యత్తులో కాలువ ద్వారా నీరు రాక ఇబ్బందులు ఏర్పడతాయని కావున అధికారులు వెంటనే స్పందించి కట్ట ఆక్రమణను నిలిపివేయాలని పచ్చారు గడ్డ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు

దీనిపై ఐబీ డిఈ జనార్దన్ రెడ్డి ని వివరణ కోరగా
ఆదర్శ కాలువ కట్ట ఆక్రమణ పై స్థానిక రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తక్షణమే కాలువ కట్టపై సర్వే నిర్వహించి ఆక్రమించిన కట్టను స్వాధీనపరుచుకుంటామని ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తక్షణం వారిపై కేసులు పెడతామని వివరణ ఇచ్చారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button