PoliticalTelangana

ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య….

ఎన్ని కష్టాలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా సరే.. జీవితంలో ముందుకు సాగాలి. చిన్న చిన్న కష్టాలకే కుంగిపోకూడదు.

మరీ ముఖ్యంగా ఆవేశంలో విచక్షణ మరిచిపోయి ప్రవర్తించకూడదు. ఆ కొన్ని సెకన్ల సమయం మనసును కంట్రోల్‌ చేసుకోగలిగితే.. చాలు. జీవితం ఎవరికి పూల బాట కాదు. కష్టాలుంటాయి..

అలానే సంతోషాలుంటాయి. అన్నింటిని సమంగా తీసుకోవాలి. లేదంటే మనతో పాటు మనల్ని కన్నవాళ్లు.. మనం కన్నవాళ్లకు కూడా జీవితాంతం ఏడుపు తప్ప ఏం ఉండదు.

అందుకే ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు అంటారు పెద్దలు. కానీ నేటి కాలంలో మనుషులకు ఇంత ఓపిక ఉండటం లేదు. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఇక సదరు ఎమ్మెల్యేది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

ఆ వివరాలు.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

ఇక రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప, బాబు. ఇక రూపాదేవి గత రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం.

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం, బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. మరి ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ.. రూపా దేవి ఇలాంటి దారుణం నిర్ణయం తీసుకుంది.

కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా.. ఆత్మహత్య చేసుకుని.. వారికి తల్లి ప్రేమను దూరం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు.

రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలు వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేది ప్రేమ వివాహం అని.. వారిద్దరూ ఉస్మానియా కాలేజీలో క్లాస్‌మెట్స్‌ అని.. ఇంత కాలం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తెలుపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button