PoliticalTelangana

జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహణ… పూల నాగయ్య

జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహణ... పూల నాగయ్య

ఈ నెల 31 తేదీ న ఆలేరు క్రీడా ప్రాంగణం లో జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహణ……పూల నాగయ్య

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 29

యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31 తేది న,(ఆదివారం) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు 49వ జూనియర్ బాల,బాలికల కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించబడునని జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య తెలిపారు..

ఇందులో పాల్గొను క్రీడాకారులు 20 సంవత్సరాల లోపు వారై, మరియు బాలురు 70 కిలోలు, బాలికలు 65 కిలోలు లోపు వారై ఉండాలి.ఇందు వెంట ఆధార్ కార్డు, జనన ధ్రువపత్రంతో తీసుకరావాలి.

ఇందులో సెలెక్ట్ అయిన జట్లు జనవరి 11 నుండి 14 వరకు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో జరుగు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button