KarimnagarPoliticalTelangana

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

అత్తగారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్​ జిల్లా జమ్మికుంట గణేశ్​నగర్​కు చెందిన కావ్య(29), గోపన్​పల్లి గ్రామానికి చెందిన రాజుకు మూడేళ్ల క్రితం వివాహమైంది.

వీరు చందానగర్​లో నివాసముంటున్నారు. రాజు సెక్యూరిటీ గార్డుగా, కావ్య ఇండ్లల్లో పనిచేస్తున్నారు.

వీరికి సంతానం కలుగకపోవడంతో కొన్ని రోజులుగా అత్తింటివారు కావ్యను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. మరోవైపు భర్త అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నాడు.

దీంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి ఫిర్యాదుతో చందానగర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button