PoliticalTelangana

కవితకు 41ఏ కింద సీబీఐ నోటీసులు…

కవితకు 41ఏ కింద సీబీఐ నోటీసులు…

మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత కీలక భేటీ

సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు…

కవిత తాను హాజ‌రుకాలేన‌ని సీబీఐకి లేఖ…

తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నాయంటూ…

సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులు పంపించింది.

ఈ మేర‌కు ఇవాళ ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, ఆమెను నిందితురాలిగా మారుస్తూ సీబీఐ తాజగా నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కవిత తాను హాజ‌రుకాలేన‌ని సీబీఐకి లేఖ రాశారు. ఇదిలా ఉండ‌గా సీబీఐ నోటీసుల నేపథ్యంతో కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత… కేసీఆర్ తో ఈ అంశంపై చర్చిస్తున్నారు.

సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసు లను ఉపసంహరించుకోవాలని లేఖలో కవిత కోరారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు విరుద్ధంగా ఈ నోటీసులు ఉన్నాయని ఆమె చెప్పారు.

సీబీఐకి ఏవైనా సమాధానాలు కావాలంటే… తాను వర్చువల్ పద్ధతితో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… తనకు ప్రచార బాధ్యతలు ఉన్నాయని చెప్పారు.

ఈ కారణంగా తాను ఢిల్లీకి విచారణకు రాలేనని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో, తనకు జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించాలని కోరారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button