KhammamPoliticalTelangana

పొంచి ఉన్న ప్రమాదం… పట్టించుకోని అధికారులు

పొంచి ఉన్న ప్రమాదం… పట్టించుకోని అధికారులు

పొంచి ఉన్న ప్రమాదం… పట్టించుకోని అధికారులు

దంతాలపల్లి మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ లోని వ్యవసాయ పంట పొలాలలో విద్యుత్ సరపరా చేసే విద్యుత్ తీగలు కిందికి ఉండడంతో అటువైపు వెళ్లే రైతులకు ఎక్కడ తగులుతుందోనని బిక్కు బిక్కుమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దోరాపల్లి యాకన్న అనే రైతు పలుమార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని యాకన్న అనే రైతు విద్యుత్ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

తమ పంట పొలంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలతో వ్యవసాయ పనులకు పశువులకు ఇబ్బంది కలుగుతుంది అని రైతన్నాడు .

దయచేసి విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ తీగలు సరిచేయాలని లేకుంటే రైతులకు పశువులకు ప్రాణాపాయం పొంచి ఉందని రైతు యాకన్న దీనస్థితిలో విన్నవించుకున్నాడు.

ఇప్పటికైనా విద్యుత్ ఉన్నంత అధికారులు స్పందించి రైతుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button