
9,175 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాస్ అయితే చాలు..
మీకో శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం 9175 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ (టెక్నికల్/ట్రేడ్స్‌మ్యాన్/పయనీర్ – పురుషులు/మహిళలు) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మరో 5 రోజుల్లో అంటే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది.
చివరి తేదీ మే 19, 2026 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి.. పరీక్ష విధానం, ఫీజు, ఇతర మినహాయింపులు ఏంటి అంటే..
అర్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావించే
అభ్యర్థులు : ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో అనుభవం, ఐటీఐ సర్టిఫికేట్, లేదా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయసు : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు జనవరి 1, 2026 నాటికి
కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు అభ్యర్థుల వయస్సు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర అన్ని పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపు : రిజర్వ్డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది.
ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ. 100 రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం : ఈ నియామకంలో ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) / నైపుణ్య పరీక్ష / PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్ / వైద్య పరీక్ష (DME/RME) మొదలైన వాటి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం : ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ 3 ప్రకారం నెలకు రూ. 21,700 – రూ. 69,100 జీతం అందిస్తారు.
దరఖాస్తు విధానం : ఈ రిక్రూట్మెంట్కు అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు CRPF అధికారిక వెబ్సైట్, rect.crpf.gov.in ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.



