HyderabadPoliticalTelangana

మంగ్లీ, సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదు చేసాం : పంజాగుట్ట సీఐ

మంగ్లీ, సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదు చేసాం : పంజాగుట్ట సీఐ

మంగ్లీ, సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదు చేసాం : పంజాగుట్ట సీఐ

హైదరాబాద్ నగరంలో ఫోక్ సింగర్ మంగ్లీ వివాదం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే… అయితే ఈ ఘటనపై పంజాగుట్ట సీఐ వివరణ ఇచ్చారు.

మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిందంటూ న్యాయవాది సుబ్బారావు మంగ్లీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే వెనువెంటనే మంగ్లీ కూడా సుబ్బారావు మీద పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట సీఐ రామకృష్ణ తెలిపారు. అయితే ఈ చీటింగ్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధానంగా బెదిరింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది.

ఇదిలా ఉండగా న్యాయవాది సుబ్బారావు మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లుగా అనుమానం రావడంతో న్యాయవాది సుబ్బారావును పోలీసులు తనిఖీ చేశారని చెప్పారు…

అంతేకాకుండా న్యాయవాది సుబ్బారావు అదే సమయంలో సరైన ఆధారాలు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ ఎదుట న్యూసెన్స్ సృష్టించడం సృష్టించినందుకు కూడా అతనిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా మరోవైపు మైక్రో ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి రావడంతో సైబరాబాద్ పోలీసులు నిన్న రమావత్ మధును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట సీఐ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడ్వకేట్ సుబ్బారావుకు బలవంతంగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. బాధితుల పక్షాన ఉన్న లాయర్‌ను ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. సదరు సీఐతో పాటు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button