
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు
కరీంనగర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. కార్యాలయానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులను చూసి అధికారులు కంగుతిన్నారు.
కీలక దస్త్రాలు, రిజిస్ట్రార్లను తనిఖీ చేశారు. భూ క్రయ విక్రయాల పై జరిగిన డాక్యుమెంట్లను పరిశీలన జరిపారు. పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల లావాదేవీలపై వివరాలను సేకరించారు. గతంలో ఏసీబీ అధికారుల రైడ్స్, ప్రస్తుత విజిలెన్స్ అధికారుల సోదాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ముందస్తు రాకను గమనించి డాక్యుమెంటరి రైటర్స్ అన్ని కార్యాలయాలకు తాళాలు వేశారు. సోదాలు నిర్వహించిన వారిలో ఎస్పీ శ్రీనివాసరావు, ఏవోపీలు తదితరులు ఉన్నారు.



