Uncategorized

ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ అన్ సైక్లింగ్

ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ అన్ సైక్లింగ్

ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ అన్ సైక్లింగ్

ర్యాలీ ని ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శూక్ల

సికే న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ :
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సండేస్ అన్ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించిన సైకిల్ ర్యాలీకి నగరంలోని సైక్లిస్టుల నుండి అద్భుత స్పందన లభించింది.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శూక్ల జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయష్ రంజన్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోనీ బాలదేవి తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో విస్తృతస్థాయిలో నిర్వహిస్తున్నరని, రాష్ట్రంలో అద్భుతమైన క్రీడా ప్రతిభ ఉందని గవర్నర్ శ్రీ శివప్రసాద్ అన్నారు. విస్తృత స్థాయిలో వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖను ఆయన అభినందించారు. మంత్రులు శ్రీధర్ బాబు వాకిటి శ్రీహరి క్రీడల సలహా దారులు ఏపీ జితేందర్ రెడ్డి చైర్మన్ శివసేనా రెడ్డి లో ముందు వరుసలో ఉండి సైకిల్ తొక్కుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల్లో ప్రజలు భాగస్వామ్యం అయ్యే విధంగాతెలంగాణ క్రీడా శాఖ అనేక క్రీడా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు మంత్రులు అభినందనలు తెలిపారు.గచ్చిబౌలి స్టేడియం ప్రాక్టీస్ గ్రౌండ్..ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమైన ఈ సైక్లింగ్ ర్యాలీ ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, పిస్తా హౌస్ జంక్షన్, బిట్స్, కేబుల్ బ్రిడ్జ్, మాదాపూర్, భారతీయ విద్యాభవన్ సెంటర్ రోడ్, బయోడైవర్సిటీ రోడ్ మీదుగా ప్రయాణించి తిరిగి గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుందిఈ కార్యక్రమంలో రాష్ట్ర సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు కోచులు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు సైక్లింగ్ అసోసియేషన్లు సైకిల్ యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి సైకిలిస్టుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున సర్టిఫికెట్, మెమెంటోలు అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button