
Web desc : వాహనదారుడి చెంపపై కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. డ్రంక్ అండ్ డ్రైవ్లో రచ్చ.. వీడియో వైరల్.. సాధారణంగా పోలీసులు వీకెండ్ రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిర్వహిస్తుంటారు.
ముఖ్యంగా మందుబాబులు సాయంత్రం కాగానే ఫుల్ గా తాగి రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు. తప్పతాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతగా చెప్పిన కొంత మంది బేఖాతరు చేస్తున్నారు.
వీరు తాగి వాహనాలు నడిపి వారి జీవితాల్ని మాత్రమే కాదు..ఎదుటి వారి జీవితాల్ని కూడా రిస్క్ లో పడేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి.
అందుకే పోలీసులు తప్పతాగి వాహనాలు నడిపించేవారిపై చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గచ్చి బౌలీలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనిలో కొంతమంది ప్రయాణికుల్ని తాగినట్లు అనుమనాంతో రీడింగ్ చెక్ చేస్తున్నారు.
ఇంతలో ఒక వాహన దారుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించలేదు. మరీ అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదా పోలీసులు చెప్పింది అతనికి అర్థం కాలేదో కానీ అతను రీడింగ్ తీసుకొవడానికి సహాకరించలేదు.
ఇంతలో అక్కడ విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ప్రయాణికుడి చెంప మీద కొట్టాడు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. అసలు రీడిండ్ తీసుకొవడం మీ డ్యూటీ.
ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మోతాదుకు మించి తాగినట్లు నమోదైన కేసులుపెట్టడం, వాహనాల్ని సీజ్ చేయడం వంటివి చేయాలి.. కానీ పబ్లిక్ మీద చెయ్యి చేసుకొవడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై వెంటనే ఆ కానిస్టేబుల్ పై డిపార్ట్ మెంట్ తరపున చర్యలు తీసుకొవాలని కొంత మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.




