MuluguPoliticalTelangana

"ఇసుక సొసైటీ ఉపాధికి అడ్డు వస్తే" ఊరుకునేదే లేదు."కే.టీ.ఆర్

"ఇసుక సొసైటీ ఉపాధికి అడ్డు వస్తే" ఊరుకునేదే లేదు."కే.టీ.ఆర్

కే.టీ.ఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు.

“ఇసుక సొసైటీ ఉపాధికి అడ్డు వస్తే” ఊరుకునేదే లేదు.”

“మీ రాజకీయ లబ్దికోసం, ఆదివాసులను బలి చేయకండి.”

“గిరిజన ఉపాధికి మార్గం వేసిన వాడే” ఆదివాసి అభివృద్ధికి అడ్డు.”

“ఖబర్దార్ గిరిజనుల అభివృద్ధికి విఘాతం కల్పిస్తే ఊరుకునేది లేదు.”

“ములుగు జిల్లా లో ప్రతిపక్షంపై మండిపడుతున్న గిరిజన సంఘా నేతలు “

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఇసుక సొసైటీ ల ద్వారా ఉపాధి పొందుతూ ఇప్పుడిప్పుడే ఆర్ధిక పురోగతి వైపు అడుగులు వేస్తున్న గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవద్దని ములుగు జిల్లా గిరిజన సంఘాల నాయకులు అన్నారు.. గురువారం వారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత బీ.ఆర్.ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరా జరిగిన ఇసుక దోపిడీ గురించి పెదవి పెగల్చని కే.టీ.ఆర్ నేడు ప్రజా ప్రభుత్వంలో అక్రమాలకు తావు లేకుండా గిరిజనుల అభివృద్ధికి ఇతోధికంగా ఉపయోగపడుతున్న గిరిజన ఇసుక క్వారీలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదాన్నారు… పేద ప్రజలకు ఉపాధిని ఇస్తున్న ఇసుక క్వారీలపై కే.టీ.ఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..

నిన్న మీరు గిరిజన ఇసుక క్వారీల గురించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని తెలిపారు..
మీ ప్రభుత్వ హయాంలో ఇసుక రంగంలో జరిగిన దోపిడీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గిరిజన సొసైటీలకు సరైన అనుమతులు ఇవ్వకుండా, అడ్డగోలుగా ఓవర్‌లోడ్లు, జీరో వ్యాపారాలు నడిపింది ఎవరో జగమెరిగిన సత్యమే.
ఇరిగేషన్ క్వారీల పేరుతో ఏమి జరిగిందో, డబుల్ బెడ్‌రూమ్ ఇసుక పేరుతో ఎంత దోపిడీ జరిగిందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.

అంతేకాదు, అడ్డగోలుగా వ్యాపారం చేయించి గిరిజన సొసైటీలకు రావాల్సిన బిల్లులు కూడా ఇవ్వకుండా జరిగిన అన్యాయానికి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అంటూ అంతే కాకుండా,
ప్రస్తుతం ఇసుక వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకుని మాట్లాడండి. ఎక్కడైనా ఒక్క టన్ను ఓవర్‌లోడ్ వెళ్తుందా? ఎక్కడైనా జీరో బిజినెస్ జరుగుతుందా? దమ్ముంటే నిరూపించండి.
ఆధారాలు లేకుండా, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేసి వేలాది మంది ఉపాధిపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. అలాంటి రాజకీయాలతో మీరు ప్రతిపక్షంలో ఉన్న స్థానం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది..

మీ ప్రభుత్వం సమయంలో కాళేశ్వరం పూడికతీత 25 నుంచి 30 కోట్లు క్యూబిక్ మీటర్లు టెండర్లు కి పిలిచి దోచుకుంటివి తింటివి ఆయన నీ అవినీతి కి అది సరిపోలేదా అని ఆరోపించారు..
-అప్పుడు మీ ప్రభుత్వం నేరేళ్ల ప్రజలు అక్రమ రవాణా ఆపమని కోరితే ఆ ప్రజలనీ కొట్టించి బెదిరించి లారీ లు తో గుద్దించి కేసు లు పెట్టించి బయ బ్రాంతులకు గురి చేసినప్పుడు ఎక్కడికి పోయి మాట్లాడవు.. నీ ప్రభుత్వం వచ్చిన తరువాత సంతోష్ రావు హరీష్ రావు మీరు నడపలేదా ఓవర్లోడ్లు జీరో లు అక్రమ రవాణా…ఈ ప్రభుత్వం లో ఎక్కడ అవినీతి జరుగుతుందో నిరూపించాలి.

-మీ ప్రభుత్వం హయం లో 2014-2023 వరకు మీరు ఎంత క్యూబిక్ మీటర్లు ఇచ్చారో బహిరంగ విచారణ కి రండి అపుడు టెండర్ లు అని మీ బినామీ ఆయన గుత్తేదారులు కి ఇచి ఇక్కడ ఉన్నా గిరిజనులు పొట్ట కొడితివి… కరీంనగర్, భూపాలపల్లి, పెదపల్లి, మహబూబ్నగర్ నారాయణపేట లో ఎంత క్యూబిక్ మీటర్లు పెర్మిషన్ ఇచ్చారు.. అపుడు భద్రాచలం ములుగు గిరిజనులకు ఎంత పెర్మిషన్ ఇచ్చారు… పెర్మిషన్ ఇస్తే ఇక్కడ కి లారీ లు బాగా వస్తాయి ఇక్కడ పెర్మిషన్ ఇవ్వకూడదు అనే ఆలోచన చేసి నువ్వు నీ బినామీలు పెర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు బహిరంగ సభ కి మా గిరిజనులు మెత్తం సిద్ధం

ఇటుకలపాడు, జాజిరెడ్డిగూడెం ఇసుక క్వారీల నుంచి మీ పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన జీరో బిజినెస్ వ్యవహారాలను కూడా ప్రజలు మర్చిపోలేదు. ఆ ఘటనలపై సమాధానం చెప్పకుండా నేడు గిరిజన క్వారీలపై విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
ఇప్పుడు ప్రభుత్వం గిరిజన సొసైటీలకు న్యాయం చేస్తూ, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే అది మీకు అన్యాయంగా కనిపించడం ఆశ్చర్యకరం. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ప్రజలే దానికి తగిన సమాధానం చెప్తారు..

-గిరిజనులు అయిన మేము బతకటం మీకు ఇష్టం లేదా
ఎందుకు లేని పోని ఆరోపణలు చేసి ఇక్కడ ఉన్నా మంత్రులు మీద ఆరోపణలు చేసి మా పొట్ట కొట్టి రాజకీయ లబ్ధి పొందుతావు ఇంకా మీ హయాంలో చేసిన ఇసుక బిల్లులు ఇవకుండా 2019 -2023 నుంచి మమ్మలిని మోసం చేసి ఇంకా ఎందుకు అంత అసూయ మా గిరిజన మంత్రి మీద లేని పోని ఆరోపణలు తగదు …
ఆయన ఈ ప్రభుత్వం లో మాకు ఉపాధి కల్పిస్తూ పారదర్శకంగా ఇసుక యొక్క రవాణా జరుగుతుంది …అందుకు నిదర్శనం మా ప్రాంత లో పర్యటించి తెలుసుకోగలవు.

బహిరంగ చర్చకు మేము సిద్ధం ఇక్కడ మా గిరిజన ఉపాధికి ప్రభుత్వం తరపున ఎంత క్యూబిక్ మీటర్లు పెర్మిషన్ వచ్చిందో…నిజం తెలుసుకుని మాట్లాడు అని హెచ్చరించారు..నువ్వు నీ మనుషులు తో చేస్తే ఒక నీతి ఇంకొకరు చెస్తే తప్పా…ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ క్వారీ లో జరిగే తీరు ప్రజలకి యావత్ పత్రిక సోదరులు కి తెలుసు…

నువ్వు చెత్త మాటలు మానాలి ఎవడో చెప్పిన మాటలు విని ఒక పార్టీ కి అధ్యక్షుడు అయి ఉండి ఇంత దిగజారి మాటలు మాట్లాడుతావు అనుకోలేదు…ఇక నైనా ఆరోపణ చేసే ముందు తెలుసుకో ఎంత పెర్మిషన్ ఇచ్చారు 12 కోట్లా.. ? ఎంత అనే తెలుసుకో..?
ఇంకా దీనికి తోడు నీ బ్లాక్మెయిల్ గుండా గాలిని పెట్టుకుని మా క్వారీ లో డ్రోన్ ఎగిరవేయటానికి నీకు ఎవరు ఇచ్చారు.. ఆ డ్రోన్ లు ఎగురవేసిన వాలు, ఎలా గిరిజనులు క్వారీ లో డ్రోన్ లు ఎగురవేసి మా హక్కు లు కాలరస్తారు.. దీనికి తగిన పరిణామాలు ఉంటాయి అని మర్చిపోవద్దు ..

ఆ డ్రోన్ లు ఎగురవేసిన వాలు, నీకు మాయ మాటలు చెప్పిన వాలు మా గిరిజన క్వారీ లు అమ్ముకుని ఎంత లబ్ధి పొందారో తెలుసుకో ముందు నువ్వు…?
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా అగుపించినట్లు అవినీతి లో పీకలు దాక కురికపోయిన మీకు పక్షపాతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి మంత్రులపైన ఆరోపణలు చేయడం మి దుర్బుద్ధికి నిదర్శనం. ఎ లాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం , మీ రాజకీయ మనుగడకే ప్రమాదకర, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button